
జాతీయ- అంతర్జాతీయ
వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో 10శాతం కన్నా తక్కువ మందిలోనే కరోనా వైరస్ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. అందువల్ల వ్యాక్సినేషన్ ద్వారానే సామూహిక వ్యాధి నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధ్యమని అభిప్రాయపడ్డారు. అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో వైరస్ బారినపడ్డ వారిలో 50-60శాతం మందికి యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయన్నారు. ప్రస్తుతం ఆమోదం పొందిన టీకాలు కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వైరల్ లోడ్ తక్కువగా ఉన్నా, లేక కరోనా వచ్చి లక్షణాలు లేని సందర్భాల్లో వ్యాక్సిన్ల పనితీరుపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.