PNB: FD వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన పీఎన్‌బీ - PNB-revises-fixed-deposit-FD-rates
close

Updated : 13/05/2021 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PNB: FD వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన పీఎన్‌బీ

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ త‌న బ్యాంక్ వినియోగ‌దారుల‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్ల‌ను స‌వ‌రించింది. సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ డిపాజిట్ల‌పై 0.5% అద‌న‌పు వ‌డ్డీ రేటును పొంద‌డం కొన‌సాగుతుంది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో మెచ్యూర్ అయిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై బ్యాంక్ 3% - 5.25% మ‌ధ్య వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఈ వ‌డ్డీ రేట్లు 1 మే 2021 నుండి అమ‌ల్లో ఉంటాయి.

రూ. 2 కోట్ల క‌న్నా త‌క్కువ డిపాజిట్ చేసే సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగ‌దారుల‌కు ఈ క్రింది వ‌డ్డీ రేట్లు అమ‌లులో ఉంటాయి.

రూ. 2 కోట్ల క‌న్నా త‌క్కువ డిపాజిట్ చేసే సీనియ‌ర్ సిటిజ‌న్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగ‌దారులు త‌మ డిపాజిట్ల‌పై 0.5% అద‌న‌పు వ‌డ్డీ రేటును పొందుతారు. వీరికి 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల‌లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల‌కు 3.5% నుండి 5.75% మ‌ధ్య వడ్డీ రేటు ల‌భిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌, కోట‌క్ మ‌హీంద్రా, ఎస్ బ్యాంక్ కూడా త‌మ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ఈ నెల‌లో స‌వ‌రించాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని