close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.1,86,600 కోట్లకు మీడియా, వినోద రంగ ఆదాయం

2021-22పై కేపీఎమ్‌జీ అంచనాలు

ముంబయి: మీడియా, వినోద రంగం వచ్చే ఏడాది రాణిస్తుందని కేపీఎమ్‌జీ అంచనా వేస్తోంది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇబ్బంది పడుతున్నా, 2021-22లో రూ.1,86,600 కోట్ల స్థాయికి ఈ రంగం చేరుకుంటుందని సంస్థ అంచనా వేస్తోంది. డిజిటల్‌ వైపునకు వేగంగా అడుగులు పడుతుండటం ఇందుకు దోహదం చేస్తుందని ‘ఎ ఇయర్‌ ఆఫ్‌ స్క్రిప్ట్‌: టైమ్‌ ఫర్‌ రీసైలెన్స్‌’ అనే నివేదికలో పేర్కొంది.  2020-21లో ఈ రంగం 20 శాతం క్షీణిస్తున్నా, తదుపరి ఏడాది 33 శాతం పుంజుకుంటుందని తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం.. 2030 నాటికి కాకుండా.. 2028 నాటికే డిజిటల్‌ వినియోగదార్ల సంఖ్య 100 కోట్లకు చేరవచ్చని వివరించింది. 2019-20లో ఈ రంగ మొత్తం ఆదాయం రూ.1,75,100 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రూ.1,40,200 కోట్లకు తగ్గుతుందని.. తర్వాతి ఏడాది పుంజుకుని రూ.1,86,600 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.