వైద్య మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ 5
close

Published : 13/05/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్య మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ 5

హౌసింగ్‌ డాట్‌కామ్‌ నివేదిక

దిల్లీ: దేశంలోని 8 ప్రధాన నగరాల్లో వైద్య మౌలిక వసతుల పరంగా దేశ రాజధాని దిల్లీ చివరి స్థానంలో నిలిచింది. పుణె అగ్రస్థానంలో నిలవగా.. హైదరాబాద్‌కు ఐదో ర్యాంకు లభించింది.అహ్మదాబాద్‌ (2), బెంగళూరు (3), ముంబయి (4), చెన్నై (6), కోల్‌కతా (7) స్థానాలు పొందాయి.  ప్రతి 1000 మంది జనాభాకు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల పడకల సంఖ్య, గాలి- నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, మెరుగైన జీవనం లాంటి వాటిని ప్రమాణాలుగా తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు స్థిరాస్తి పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌కామ్‌ తెలిపింది. అమెరికాకు చెందిన న్యూస్‌కార్ప్‌, ఆస్ట్రేలియా గ్రూప్‌ సంస్థ ఆర్‌ఈఏకు చెందిన ఈ సంస్థ  ‘భారత్‌లో ఆరోగ్య సంరక్షణ స్థితి’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆయా నగరాలకు ర్యాంకులు ఇచ్చే విషయంలో ఆసుపత్రుల పడకలకు 40 శాతం ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోని 8 ప్రధాన నగరాలు- అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ- ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణెలను పరిగణనలోకి తీసుకుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని