కొనసాగిన నష్టాలు
close

Published : 13/05/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగిన నష్టాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు డీలా
సమీక్ష

సూచీల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడం ఇందుకు నేపథ్యం. కమొడిటీ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం అధికమవుతుందనే భయాలు అంతర్జాతీయ మార్కెట్లను వెంటాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు తగ్గి 73.42 వద్ద ముగియడం కూడా ఇందుకు తోడైంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ లాభపడగా, టోక్యో సియోల్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా కదలాడాయి.
సెన్సెక్స్‌ ఉదయం 49,171.28 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఏదశలోనూ కోలుకోలేకపోయిన సూచీ.. ఇంట్రాడేలో 48,550.72 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు  471.01 పాయింట్ల నష్టంతో 48,690.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 154.25 పాయింట్లు కోల్పోయి 14,696.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,649.70- 14,824.05 పాయింట్ల మధ్య కదలాడింది.

* మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం 59 శాతం పెరగడంతో గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ షేరు  ఇంట్రాడేలో 24.99 శాతం దూసుకెళ్లి, రూ.894.90 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 22.19 శాతం లాభంతో రూ.874.80 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 డీలాపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 3.35 శాతం కుదేలైంది. హెచ్‌యూఎల్‌ 3.07%, ఓఎన్‌జీసీ 2.54%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.43%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.23%, కోటక్‌ బ్యాంక్‌ 2.12%, ఎం అండ్‌ ఎం 1.97%, అల్ట్రాటెక్‌ 1.46%, టెక్‌ మహీంద్రా 1.45%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.28% చొప్పున నష్టపోయాయి. టైటన్‌ 1.31%, మారుతీ 1.21%, పవర్‌గ్రిడ్‌ 1.05%, ఎస్‌బీఐ 0.93% మేర లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, బ్యాంకింగ్‌, చమురు- గ్యాస్‌, ఇంధన, ఫైనాన్స్‌ 3.22% వరకు పడ్డాయి. వాహన షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో 1537 షేర్లు నష్టాల్లో ముగియగా, 1542 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 154 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

నేడు మార్కెట్లకు సెలవు
రంజాన్‌ సందర్భంగా నేడు (గురువారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని