కార్పొరేట్ల నుంచి ఉద్యోగులకు ఊరట..! - introduces 4 day work week..no questions asked infinite PL
close

Published : 13/05/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్ల నుంచి ఉద్యోగులకు ఊరట..!

 మరింత సౌకర్యవంతగా పని వాతావరణం

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న పలు సంస్థలు ఇప్పటికే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. దీంతో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఖర్చు గణనీయంగా తగ్గింది. కాకపోతే తీవ్రమైన ఒత్తిడి ఉన్న ఉద్యోగాల్లో చేస్తున్న వారు మాత్రం పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇయర్‌ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, ఎక్కువ పనిగంటలు, కదలికలు ఉండకపోవడం వంటివి వీటిల్లో ఉన్నాయి. ఇటీవల జీఐ గ్రూప్‌ ‘ఆల్‌ ఇన్‌ది మైండ్‌: ద స్టేట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ ఇన్‌ది కార్పొరేట్‌ ఇండియా’  పేరిట ఓ సర్వేను విడుదల చేసింది.  సుదీర్ఘ పనిగంటల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు 77శాతం మంది వెల్లడించారు. 79 మంది నాయకత్వ బాధ్యతలను ఒత్తిడి ఫీలవుతున్నారని పేర్కొంది.  

ఇలాంటి పరిస్థితుల్లో ఓయో సీఈవో రితేష్‌ అగర్వాల్‌ స్పందించారు. తమ సంస్థ ఉద్యోగులకు పలు అంశాల్లో మినహాయింపులు, అదనపు సౌకర్యాలను ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిడితో కూడిన వాతావరణంలో కుటుంబంలోని ఆత్మీయులతో గడపడం చాలా ముఖ్యమన్నారు. బుధవారం నుంచి ఓయో ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయన్నారు. వారి బుధవారం కూడా ఆఫ్‌ లభిస్తుందని ప్రకటించారు. ఉద్యోగులు ఎటువంటి కారణం చెప్పకుండా జులై వరకు అవసరమైనన్ని వేతనంతో కూడిన సెలవులు తీసుకోవచ్చన్నారు. తాము వ్యాపారం, డెడ్‌లైన్ల విషయంలో ఎటువంటి ఒత్తిడికి గురికావడంలేదన్నారు. తమ పనిపై ఎటువంటి ప్రభావం పడదని చెప్పారు. తన ఆఫ్‌ రోజున ఓయో కొవిడ్‌ వార్‌రూమ్‌లో సేవలు అందిస్తానని రితేష్‌ వెల్లడించారు. కొవిడ్‌ బారిన పడిన తన మిత్రుల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు.

స్టాక్‌బ్రోకింగ్‌ సేవల సంస్థ జీరోధ కూడా గత వారం ఉద్యోగులకు పని గంటలను తగ్గించేసింది.  ఈ సంస్థ వ్యవస్థాపకుడు నితిన్‌ కాంత్‌ కూడా ఉద్యోగులకు మినహాయింపును ప్రకటించారు. రాత్రి ఆరు తర్వాత పనికి సంబంధించిన కాల్స్‌, ఛాట్స్‌ ఉండవని తేల్చిచెప్పారు. సెలవు రోజుల్లో కూడా ఈ సేవలను నిలిపేసినట్లు పేర్కొన్నారు. ఈ ఒత్తిడి ఉద్యోగుల మెదళ్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని భావించి నిలిపివేసినట్లు వివరించారు.

ఇక ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ కూడా ఈ వారం ప్రారంభంలో ఉద్యోగులకు పనిభారం తగ్గించింది. మే నెల మొత్తం వారానికి నాలుగు పనిదినాలు మాత్రమే ఉంటాయని ప్రకటించింది. ఉద్యోగులు తమకు నచ్చిన రోజున ఆఫ్‌ తీసుకొనే అవకాశం కల్పించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని