అక్షయ్‌ హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్‌..! - akshay in akasam nee haddura hindi remake
close
Published : 22/07/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది సినిమాల రీమేక్‌లపై ఆసక్తి చూపించే బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ మరో సినిమాను రీమేక్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారట. అందులో అక్షయ్‌ ప్రధానపాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ‘సూరారై పోట్రు’, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేర్లతో ఈ చిత్రం రెండు భాషల్లోనూ భారీ విజయం సాధించింది. తమిళ స్టార్‌హీరో సూర్య ప్రధానపాత్రలో కనిపించి అలరించారు. హీందీలో రానున్న రీమేక్‌లో అక్షయ్‌కుమార్‌ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన డైరెక్టర్‌ సుధా కొంగర హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారట. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రాన్ని కూడా అక్షయ్‌ రీమేక్‌ చేయనున్నట్లు చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం అక్షయ్‌ నటిస్తున్న ‘బెల్‌బాటమ్‌’, ‘సూర్యవంశీ’, ‘ఆట్రంగి రే’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘పృథ్వీరాజ్‌’, ‘రక్షాబంధన్‌’, ‘రామసేతు’, ‘బచ్చన్‌పాండే’ల్లోనూ నటిస్తూ అక్షయ్‌ బిజీగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని