సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..! - Alia Joins RRR And Climax Shoot In KGF2
close
Updated : 07/12/2020 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..!

ఫొటోలు షేర్ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌’

హైదరాబాద్‌: సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి అయితే.. ‘కేజీఎఫ్‌ -2’ మరొకటి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్స్‌ ఇప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి.

జక్కన్నతో సీత..

రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ.. కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఇందులో చరణ్‌ సరసన సీతగా బాలీవుడ్ భామ ఆలియాభట్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల మహాబలేశ్వర్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో సోమవారం ఆలియాభట్‌ పాల్గొన్నారు. చిత్రీకరణ సమయంలో జక్కన్నతో ఆలియా సంభాషిస్తున్న ఓ ఫొటోని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సోషల్‌మీడియా వేదిగా అభిమానులతో పంచుకుంది.  కొన్నిరోజులపాటు ఆలియాభట్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

క్లైమాక్స్‌ మొదలైంది..

కన్నడ నటుడు యశ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్‌ మూవీ ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’. 2018లో విడుదలైన ‘కేజీఎఫ్‌’కి కొనసాగింపుగా ఈ సినిమా రానుంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ప్రతినాయకుడిగా అధీర పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ‘కేజీఎఫ్‌2’ క్లైమాక్స్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రశాంత్‌ నీల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఇక ఇది క్లైమాక్స్‌..!! రాఖీ వర్సెస్‌ అధీర. అంబ్రివ్‌.. ఎంతో క్లిష్టమైన ఫైట్‌ సన్నివేశాల్ని డైరెక్ట్‌ చేస్తున్నారు.’ అని ప్రశాంత్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఫొటోగ్రాఫర్‌ను ఆటపట్టించిన ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ‘కొమురం భీమ్‌’ రికార్డుల వేట


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని