‘ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ..’ - Breathe of Naandhi released
close
Published : 07/11/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ..’

ఆసక్తికరంగా అల్లరి నరేష్‌ ‘నాంది’ టీజర్

హైదరాబాద్‌: ‘ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ.. న్యాయం జరగాలి..’ అంటున్నారు కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన నటిస్తున్న 57వ సినిమా ‘నాంది’. విజయ్‌ కనక మేడల దర్శకత్వం వహిస్తు్న్నారు. ప్రియదర్శి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘బ్రీత్‌ ఆఫ్‌ నాంది’ అంటూ ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిధరమ్‌ తేజ్‌ దీన్ని విడుదల చేశారు. నరేష్‌ ఇందులో ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

‘15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే కానీ.. మన దేశానికి స్వతంత్రం రాలేదు. 1300 మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు.. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి...’ అంటూ పోలీసుల అదుపులో ఉన్న నరేష్‌ అనడం సినిమాపై ఆసక్తిని పెంచింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని