
తాజా వార్తలు
‘బుట్టబొమ్మ’ మరో రికార్డు
ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబ్‌ను ఓ ఊపుఊపిన ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు నెలకొల్పింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఈ పాట దేశాలు, ఖండాలు దాటి సంగీత ప్రియులతో స్టెప్పులు వేయించింది. సంగీత దర్శకుడు తమన్ కెరీర్లో ఓ మరుపురాని మైలురాయిగా మారింది. యూట్యూబ్‌లో రికార్డులమీదు రికార్డులు బద్దలుకొడుతూ వస్తున్న ఈ పాట తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 2019 డిసెంబర్ 24న విడుదలై ఇప్పటి వరకూ యూట్యూబ్‌లో మొత్తం 450 మిలియన్ వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పాట సంగీత దర్శకులు తమన్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీహిట్ సాధించింది. అటు అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ పూజాహెగ్డే కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. కాగా తమన్ టాలీవుడ్లో అగ్ర నటులందరి సినిమాలకు సంగీతం అందించే ఛాన్స్ కొట్టేశారు. చేతిలో అరడజనుకుపైగా సినిమాలతో బిజీగా ఉన్నారు.