వర్మ ఆఫీసు వద్ద ‘దిశ’ కుటుంబం ఆందోళన - Dishas family protest at Ram Gopal Varmas office
close
Published : 11/10/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్మ ఆఫీసు వద్ద ‘దిశ’ కుటుంబం ఆందోళన

హైదరాబాద్‌: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయం వద్ద దిశ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆఫీసును ముట్టడించారు. ‘దిశ’ ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్రాన్ని నిషేధించాలని కోరారు. వివాదాస్పద చిత్రాలు తీస్తున్న రామ్‌గోపాల్‌ వర్మను ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు సమాజం నుంచి వెలివేయాలని దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మీడియాతో అన్నారు. తక్షణమే యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్‌ను తొలగించాలని కోరారు. ఇప్పటికే తమ కుటుంబం ఎన్నో బాధలు అనుభవిస్తోందని, సినిమా తీసి తమను మరింత కుంగదీయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే దిశ తండ్రి సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. అభ్యంతరాలను సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉండగా వర్మ సినిమా తీయడం, ప్రచార చిత్రాలు విడుదల చేయడం సరికాదని శ్రీధర్‌ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా దిశ సినిమాపై కేసును ఉద్దేశిస్తూ.. రామ్‌ గోపాల్‌ వర్మ శనివారం ట్వీట్‌ చేశారు. ‘దిశ ఎన్‌కౌంటర్‌ సినిమాపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. ఇది నిర్భయ కేసు నుంచి జరిగిన అనేక ఘటనల ఆధారంగా తీస్తున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది’ అని ట్వీట్‌ చేశారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని