ఆర్జీవీ బయోపిక్‌.. నటుడు, దర్శకుడు ఇతడే! - Dorasai teja is acting as me in my college days tweets RGV
close
Updated : 17/09/2020 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్జీవీ బయోపిక్‌.. నటుడు, దర్శకుడు ఇతడే!

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించబోతున్న ‘రాము’ సినిమా షురూ అయ్యింది. మూడు భాగాలుగా ఈ సినిమాను తీయబోతున్నట్లు వర్మ చెప్పారు. బుధవారం ముహూర్తపు సన్నివేశానికి తన తల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారంటూ.. పూజలో తీసిన ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

‘నా బయోపిక్‌ ‘రాము’ పూజలో మా అమ్మ సూర్యవతి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బొమ్మకు మురళి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. నా సోదరి విజయ తొలి షాట్‌కు క్లాప్‌ కొట్టారు. బయోపిక్‌ పార్ట్‌-1లో నా కళాశాల రోజుల్లో వచ్చే పాత్రలో దొరసాయి తేజ నటిస్తున్నారు. అతడు మా అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అతడి వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమాకు సంబంధించి తీయబోతున్న మూడు భాగాలను బొమ్మకు మురళినే నిర్మించబోతున్నారు’ అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.

ఇటీవల వర్మ ‘పవర్‌ స్టార్‌’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా నేరుగా ‘ఆర్జీవీ వరల్డ్‌’లో విడుదలైంది. మరోపక్క ‘12 ‘o’ క్లాక్‌‌’, ‘కరోనా వైరస్‌’, ‘మర్డర్‌’ తదితర ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య నేపథ్యంలో రూపొందుతోన్న ‘మర్డర్‌’ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని