అదే జరిగితే ఫిల్మ్‌మేకర్స్‌ రెక్కలు నరికేసినట్టే! - If OTT content is censored it will be sad says Manoj Bajpayee
close
Published : 08/12/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే జరిగితే ఫిల్మ్‌మేకర్స్‌ రెక్కలు నరికేసినట్టే!

ముంబయి: వైవిధ్యమైన పాత్రలతో, నటనతో ఆకట్టుకుంటున్న నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. లాక్‌డౌన్‌ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘సూరజ్‌ పే మంగల్‌ బరీ’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలోని ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో బాజ్‌పాయ్‌ థియేటర్‌లో సినిమా చూసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ‘ప్రస్తుతం వివిధ చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. సెట్‌లో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ, జాగ్రత్తగా షూటింగ్‌ చేస్తున్నాం. ఇక ఈ చిత్రంలో నా పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతం. మాకు కావాల్సింది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇష్టపడటం. ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు థియేటర్‌ల యజమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా కాలంలో చిత్రాన్ని విడుదల చేసి మేము ఓ మెట్టు ముందుకెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇతరులు దీన్ని అనుసరిస్తారని భావిస్తున్నాను. కొవిడ్‌-19 దృష్ట్యా థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం చాలా కష్టమైన పని అయినా ప్రేక్షకులు  ధైర్యం చేసి ఈ చిత్రాన్ని చూశారు. నాకు మంచి విజయాన్నందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటా’ అని ఆయన చెప్పారు.

మనోజ్‌ సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీ మెన్‌’ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘ప్రజలు ఇంట్లో ఉండటంతో ప్రతిదీ చూస్తారనుకోవడం అవివేకం. నచ్చకపోతే వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేసేస్తారు. కథలు, కంటెంట్‌పై ప్రేక్షకులు ఎంతో అవగాహన కలిగి ఉన్నారు. ఓటీటీ సెన్సార్‌ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫిల్మ్‌మేకర్స్ రెక్కలు విరిచేసినట్లే అవుతుంది. ప్రజలు ఎంతో స్వేచ్ఛ కలిగి ఉన్నారు. కానీ, ఒక్కోసారి ఆ స్వేచ్ఛ హద్దులు దాటుతోంది. కథకు అవసరమైతే స్వేచ్ఛనందించాలి. పరిమితులు పెట్టకుండా మేకర్స్‌కు తమకు తామే సెన్సార్‌ చేసుకునే స్వేచ్ఛను కల్పించాలని కోరుతున్నాను. అంతేకాకుండా ‘దిల్లీ క్రైమ్’, ‘స్కామ్‌’, ‘ఫ్యామిలీ మెన్‌’ వంటి చిత్రాల్లో అలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి’ అని ఆయన అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని