మా ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది: వర్మ - Line clear for ram gopal varmas Murder film release
close
Published : 06/11/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది: వర్మ

‘మర్డర్‌’ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన ‘మర్డర్‌’ సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈ సినిమా విడుదల నిలిపి వేయాలంటూ నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన ‘స్టే’ ఆర్డర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీ రావుల పేర్లు, ఫొటోలు వాడకుండా సినిమా విడుదల చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వర్మ ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మర్డర్‌’ సినిమా తీయడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని గౌరవనీయులైన న్యాయమార్తి అర్థం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆర్డర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మా వద్దకు వచ్చిన తర్వాత సినిమా అప్‌డేట్‌ ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. 
వర్మ గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వివాదాస్పద చిత్రాలు తీస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ‘మర్డర్‌’ సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత మొదలైంది. మరోపక్క ‘దిశ’ హత్యాచార ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ: ఎన్‌కౌంటర్‌’ చిత్రం కూడా వివాదాల్లో పడింది. ఈ సినిమాను విడుదల చేయకూడదని, ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ట్రైలర్‌ను డిలీట్‌ చేయాలని ‘దిశ’ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కోర్టులో కేసు కూడా వేశారు. కుమార్తెను పోగొట్టుకున్న బాధలో ఉన్న తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వర్మను ఉద్దేశిస్తూ ‘దిశ’ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కాకుండా వర్మ తన జీవిత కథతో ‘రాము’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ‘కరోనా వైరస్‌’ అనే సినిమాను కూడా తీశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని