close

తాజా వార్తలు

Published : 25/11/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌బాబు రికార్డు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాదు సోషల్‌ మీడియాలోనూ రికార్డులు సృష్టిస్తుంటారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా.. పేరేదైనా మహేశ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరోమైలురాయిని అధిగమించారు. తాజాగా.. ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య 6 మిలియన్లు దాటింది. గతంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించని ఆయన ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలోనే ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్‌ ఇస్తున్నారు. ఇలా తాజాగా ఆయన 6 మిలియన్ల క్లబ్‌లో చేరారు. ట్విటర్‌లోనూ మహేశ్‌బాబును ఏకంగా 10.9మిలియన్లు అనుసరిస్తున్నారు. అత్యధిక ఆదరణ కలిగిన సౌత్‌ఇండియన్‌ స్టార్‌గానూ ఈ సూపర్‌స్టార్‌ రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా మహేశ్‌బాబు కూతురు సితార, భార్య నమ్రత చేతుల మీదుగా చేయించారు. సినిమాకు పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. జీఎం, మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరిలో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని