‘మర్డర్‌’: 11లోగా కౌంటర్‌ దాఖలు చేయండి  - Nalgonda Court On Murder Movie
close
Published : 06/08/2020 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మర్డర్‌’: 11లోగా కౌంటర్‌ దాఖలు చేయండి 

నల్గొండ: ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ ‘మర్డర్‌’ పేరిట సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన  ప్రణయ్‌ పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మర్డర్‌’ సినిమాను ఆపాలంటూ ప్రణయ్‌ భార్య అమృత నల్గొండ జిల్లా కోర్టులో సివిల్‌ దావా దాఖలు చేశారు. హత్య కేసు విచారణ దశలో ఉందని, కల్పిత కథతో ఉన్న సినిమా విడుదల అయితే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని దావాలో పేర్కొన్నారు. అందుకే సినిమాను నిలుపుదల చేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు.

దీనిపై నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. దర్శక, నిర్మాతకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈ నెల 11 వరకు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. ‘మర్డర్‌’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. న‌ట్టి కరుణ‌, న‌ట్టి క్రాంతి నిర్మాతలు. అనురాగ్ కంచ‌ర్ల స‌మ‌ర్పిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని