‘దిశ’ ఘటనపై వర్మ సినిమా.. ఫస్ట్‌లుక్‌ - RGV film on disha encounter
close
Published : 05/09/2020 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దిశ’ ఘటనపై వర్మ సినిమా.. ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వివాదాస్పద చిత్రాలు తీస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ‘మర్డర్‌’ సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. మరోపక్క తన జీవిత కథతో ‘రాము’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.

కాగా దేశ ప్రజల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిన ‘దిశ’ హత్యాచార ఘటన ఆధారంగా సినిమా తీస్తానని గతంలో వర్మ వెల్లడించారు. చివరికి శనివారం ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ‘2019 నవంబరు 26న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిపై నలుగురు వ్యక్తులు దారుణానికి పాల్పడి, హత్య చేసిన ఘటన ఆధారంగా తీస్తున్న సినిమా ‘దిశ: ఎన్‌కౌంటర్‌’. సెప్టెంబరు 26న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. యువతి హత్య జరిగిన రోజున (నవంబరు 26న) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దిశ ఘటన తర్వాత ప్రభుత్వం చట్టాల్ని మార్చడమే కాదు.. బాధితురాలి పేరుతో ‘దిశ’ పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం గొప్ప విషయం’ అని వర్మ వరుస ట్వీట్లు చేశారు. అంతేకాదు తను తీస్తున్న సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను కూడా షేర్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని