వర్మ ‘ పవర్ స్టార్’ ట్రైలర్ చూశారా? - Ram gopal Varma power star trailer released
close
Updated : 22/07/2020 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్మ ‘ పవర్ స్టార్’ ట్రైలర్ చూశారా?

హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘ పవర్ స్టార్’. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయినా, వర్మ మాత్రం  వరుస చిత్రాలను ఓటీటీల వేదికగా విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. 

ఈ నేపథ్యంలో ‘ పవర్ స్టార్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నా అంటూ సంచలనానికి తెరలేపారు వర్మ. ప్రకటించడమే కాదు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను కూడా విడుదల చేశారు. డబ్బులు చెల్లించి ట్రైలర్ చూడాలంటూ అభిమానులు కోరిన ఆయన తాజాగా అది లీక్ అయిందంటూ మరో ప్రకటన చేసి నేరుగా తానే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రైలర్ చూసేందుకు డబ్బులు చెల్లించిన వారికి  వీలైనంత త్వరగా వెనక్కి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ జూలై 25న https://www.rgvworldtheatre.com/ వేదికగా విడుదల కానుంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని