క్యాన్సర్‌ను జయించిన సంజయ్‌ దత్‌ - SanjayDutt issues a statement revealing he is emerged victorious in his battle with cancer
close
Published : 22/10/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్యాన్సర్‌ను జయించిన సంజయ్‌ దత్‌

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ ఊపిరితిత్తుల‌ క్యాన్సర్‌ను జయించారు. తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఇదేనని పేర్కొన్నారు.

‘గత కొన్ని వారాలు నాకు, కుటుంబ సభ్యులకు ఎంతో కష్టంతో కూడుకున్నది. దృఢమైన వారు ఎక్కువ పోరాడేలా దేవుడు పరిస్థితుల్ని సృష్టిస్తాడని అందరూ అంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరిగింది. ఇవాళ నా పిల్లల పుట్టినరోజు.. ఈ సందర్భంగా నేను క్యాన్సర్‌తో పోరాడి, జయించానని చెప్పడం సంతోషంగా ఉంది. నా ఆరోగ్యాన్ని పిల్లలకి కానుకగా ఇస్తున్నా’.

మీ మద్దతు, ప్రార్థనలు లేకపోతే నేను దీన్ని సాధించగలిగేవాడ్ని కాదు. ఈ విషయంలో నా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు రుణపడి ఉన్నా. మీరు నాపై కురిపించిన అమితమైన ప్రేమకు థాంక్స్‌. ప్రత్యేకించి నాకు చికిత్స చేసిన కోకిలబెన్‌ ఆసుపత్రి వైద్యులు శావంతి, బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’ అని సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డారు. వ్యాధి తీవ్రత నాలుగో దశలో ఉందని ఆగస్టులో ఆయన సతీమణి మాన్యతా దత్‌ తెలిపారు. దీంతో సంజయ్‌ కొన్నాళ్లు నటనకు కూడా బ్రేక్‌ ఇచ్చారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని