బచ్చన్‌ బంగ్లాకి కట్టుదిట్టమైన భద్రత - Security increase around Amitabh Bachchan Jaya Bachchans residence
close
Published : 16/09/2020 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బచ్చన్‌ బంగ్లాకి కట్టుదిట్టమైన భద్రత

జయా బచ్చన్‌పై విమర్శల నేపథ్యంలో..

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ బంగ్లాకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ కోణం మంగళవారం పార్లమెంటులో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ వ్యసనం చిత్రపరిశ్రమలో కూడా ఉందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీ రవికిషన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను ఎంపీ జయా బచ్చన్‌ ఖండించారు. కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపరచొద్దని, నటుడైన ఓ ఎంపీ పరిశ్రమకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విమర్శించారు.

జయా బచ్చన్‌ వ్యాఖ్యలను కంగనా రనౌత్‌ తప్పుపట్టగా.. నటీమణులు సోనమ్‌ కపూర్‌, రిచా చద్దా, తాప్సీ తదితరులు ఆమె వ్యాఖ్యలను సమర్థించారు. మరోవైపు సోషల్‌మీడియాలో కొందరు నెటిజన్లు #ShameOnJayaBachchan అంటూ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో జూహులోని బచ్చన్స్‌ బంగ్లా ‘జల్సా’ ముందు భద్రతను రెట్టింపు చేశారు. ‘జయా బచ్చన్‌ ప్రసంగం తర్వాత ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా భద్రతను పెంచాం’ అని పోలీసులు తెలిపారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని