Cinema News: ఇంకొన్ని సమస్యలున్నాయి.. - Telugu Film chamber President thanks AP CM for permits 100 percent Occupancy
close
Updated : 15/10/2021 07:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఇంకొన్ని సమస్యలున్నాయి..

ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి సామర్థ్యంతో నాలుగు షోలు నడిపించుకునేందుకు అనుమతిచ్చినందుకు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు, నిర్మాత నారాయణ దాస్‌.కె నారంగ్‌. ఇండస్ట్రీకి ఇంకా కొన్ని సమస్యలున్నాయని, త్వరలో వాటికి కూడా ఓ పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ తరపున విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమలో చాలా సమస్యలున్నప్పటికీ వాటిలో కొన్నింటిని ఏపీ ప్రభుత్వం తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక టికెట్‌ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం మా సమస్యను పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో టి.ప్రసన్న కుమార్‌, ముత్యాల రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని