మరిన్ని అవకాశాలు వస్తాయి - Telugu News Actor Ramcharan Tej Become Brand Ambassador For Disney Plus Hotstar
close
Updated : 19/09/2021 07:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరిన్ని అవకాశాలు వస్తాయి

ప్రేక్షకుల అభిరుచి... వాళ్ల నుంచి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఓటీటీ వేదికలు ప్రాంతీయ భాషలపై దృష్టిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ తెలుగులోకి అడుగుపెట్టింది. ఇటీవల నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్ట్రో’ డిస్నీ హాట్‌స్టార్‌లోనే ప్రదర్శితం అవుతోంది. ఈ సంస్థకి ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘తెలుగు వినోద రంగంలోకి డిస్నీ హాట్‌స్టార్‌ ప్రవేశిస్తుండడంతో టాలీవుడ్‌లోని నటులు, సాంకేతిక వర్గాలకి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామ’’న్నారు. డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ కంటెంట్‌హెడ్‌ సౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ ‘‘దేశంలోని కంటెంట్‌ని కొత్త పుంతలు తొక్కించడానికి ఎప్పుడూ ముందు వరసలో ఉంటాం. తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంద’’న్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని