RRR: జనవరి 7న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ - Telugu News RRR Release date Conformed
close
Updated : 03/10/2021 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: జనవరి 7న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’

ప్పుడెప్పుడా? అని ఆసక్తి రేకెత్తించిన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈసారి సినీ సంక్రాంతి ఈ చిత్రంతోనే షురూ కానుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారతీయ అతి పెద్ద యాక్షన్‌ డ్రామా చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కండి’’ అంటూ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌, ఒలివియా మోరిస్‌, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. పాన్‌ ఇండియా స్థాయిలో రూ.400 కోట్లతో రూపొందిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపిస్తారు. 1920 నేపథ్యంలో సాగే కథ ఇది.





Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని