‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. పూర్తయింది - Telugu News RRR Shoot Wrapped Up
close
Updated : 27/08/2021 08:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. పూర్తయింది

క్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా కథానాయికలు.  కీరవాణి స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ‘‘కొన్ని చిన్న చిన్న షాట్స్‌ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. 2018 నవంబరు 19న ఏదైతే బైక్‌ షాట్‌తో చిత్రీకరణ ప్రారంభించామో.. యాదృచ్ఛికంగా అదే బైక్‌ షాట్‌తో షూట్‌ పూర్తి చేశాం. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తాం’’ అని చిత్ర బృందం ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల విడుదలైన ప్రతి పోస్టర్‌లోనూ అదే విడుదల తేదీని వేస్తూ వచ్చారు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో విడుదల తేదీ ఇవ్వకపోవడంతో..అనుకున్న సమయా నికి సినిమా వస్తుందా? రాదా? అన్నది ఆసక్తికరంగా మారింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని