చరణ్‌ - శంకర్‌ చిత్రం ప్రారంభం - Telugu News RamCharan Next Project Started
close
Updated : 09/09/2021 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరణ్‌ - శంకర్‌ చిత్రం ప్రారంభం

ఏడాది దక్షిణాదిలో ఆసక్తికరమైన కలయికలతో కూడిన పలు సినిమాలు పట్టాలెక్కాయి. అందులో రామ్‌చరణ్‌ - శంకర్‌ చిత్రం ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న 50వ చిత్రమిది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌చంద్ర, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా. బాలీవుడ్‌ తార రణ్‌వీర్‌సింగ్‌, అగ్ర కథానాయకుడు చిరంజీవి, అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, రణ్‌వీర్‌ సింగ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. బలమైన సామాజికాంశాలతో శంకర్‌ మార్క్‌ సినిమాగా రూపొందుతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్స్‌: రామకృష్ణ - మోనిక, రచన: సాయిమాధవ్‌ బుర్రా, సు.వెంకటేశన్‌ - వివేక్‌ (తమిళం), పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌, వివేక్‌ (తమిళం).


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని