మనీష్‌ మల్హోత్రాకు థ్యాంక్స్‌‌: వర్మ - Thank u Manish Malhotra tweeted ram gopal varma
close
Published : 13/09/2020 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనీష్‌ మల్హోత్రాకు థ్యాంక్స్‌‌: వర్మ

25 ఏళ్ల ‘రంగీలా’.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పోస్ట్‌

ముంబయి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సూపర్‌హిట్‌ సినిమా ‘రంగీలా’. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకమైన పోస్టు‌ చేశారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడం ఓ మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. ‘‘రంగీలాకు 25 ఏళ్లు. విజనరీతోపాటు స్వతంత్ర ఆలోచనలున్న రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం.. ఛార్మింగ్‌ జాకీ ష్రాఫ్‌, అద్భుతమైన ఆమిర్‌ ఖాన్‌ నటించిన తీరు.. దీంతోపాటు ఊర్మిళ గ్లామర్‌ అడ్డంకులను పక్కకునెట్టి పాత్రను పోషించిన విధానం.. సినిమాకు బలంగా నిలిచాయి. అందమైన ఊర్మిళ స్టైలిష్‌ లుక్స్‌ ఇండియన్‌ సినిమాలో కాస్ట్యూమ్స్‌ స్టైల్‌కు సరికొత్త నిర్వచనం చెప్పాయి’.

‘రాముజీ, ఊర్మిళ, నేను.. మా ముగ్గురిది కళాత్మకమైన హృదయాలు. అందుకే చాలా సేపు చర్చించుకుని దుస్తుల డిజైన్‌ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేవాళ్లం. అప్పుడు మేం పడ్డ శ్రమకు చివరికి ఫలితం లభించింది. ఊర్మిళ లుక్‌తో ఫిల్మ్‌ ఫేర్‌ మొదటిసారి కాస్ట్యూమ్‌ డిజైన్‌ అవార్డును ప్రవేశపెట్టింది. ఆమె సెట్‌ చేసిన ట్రెండ్‌ ఇప్పటికీ అందరికీ అలానే గుర్తుండిపోయింది’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

దీన్ని చూసిన రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ‘25 ఏళ్ల క్రితం ‘రంగీల’ సినిమాలో గ్లామర్‌ను ఆవిష్కరించినందుకు.. అప్పటి నుంచి దాన్ని అలానే కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు మనీష్‌ మల్హోత్రా’ అని పేర్కొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని