‘ఆచార్య’కు తోడుగా ‘సిద్ధ’ వచ్చేశాడు! - acharya ramcharan birthday poster
close
Updated : 27/03/2021 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’కు తోడుగా ‘సిద్ధ’ వచ్చేశాడు!

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరు ప్రధాన పాత్రలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్‌‌ నిర్మిస్తూ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. తాజాగా చెర్రీ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను పోస్టర్‌ రూపంలో విడుదల చేశారు. వారిద్దరు చేతిలో తుపాకులతో వస్తున్న విరోచిత చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల చిరు చెప్పినట్టు వారి వేషధారణలు మావోయిస్టు తరహాలో ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్‌ చిరు సరసన నటిస్తోంది. మరొక పాత్రలో పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది. మే 13న ‘ఆచార్య’ థియేటర్లో పాఠాలు చెప్పనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని