మరో ‘భం భం భోలే’కి సిద్ధమా! - acharya song lyrical vedio
close
Published : 27/03/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ‘భం భం భోలే’కి సిద్ధమా!

హైదరాబాద్‌: మణీ బీట్‌కు చిరూ స్టెప్స్‌ తోడైతే వెండితెర వెలిగిపోతుంది కదా! ఆ కనులవిందు కాంబో త్వరలోనే ‘ఆచార్య’తో సాకారం కానుంది. మరో ‘భం భం బోలే’తరహాలో ‘లాహీ లాహీ’అంటూ సాగే లిరికల్‌ వీడియోను మార్చి 31న 4:05 గంటలకు ‘ఆచార్య’ చిత్ర బృందం విడుదల చేయనుంది. తాజాగా రిలీజైన పోస్టర్‌లో మెగా మార్కు భంగిమతో చిరు సందడి చేస్తున్నారు. ఎప్పటిలాగే మణిశర్మ తన మెలోడీ డ్యాన్సింగ్‌ ట్యూన్స్‌తో రెడీ అయ్యారు.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో  నటుడు రామ్‌చరణ్‌ తండ్రితో పాటు ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. కాజల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. దేవాదాయశాఖలో జరిగే అవతవకలను ఎండగడుతూ నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని