వినాయక చవితి కానుకగా ‘అఖండ’..! - balakrishna akhanda to hit theatres on vinayaka chaturthi
close
Published : 21/06/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వినాయక చవితి కానుకగా ‘అఖండ’..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతి తగ్గడంతో చిత్రాలు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. బాలకృష్ణ-బోయపాటి హిట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రీకరణ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్‌ పూర్తయింది. తొలుత మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరగడంతో చిత్రీకరణ తుదిదశలో ఉండగా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో ఈ చిత్రం త్వరలో మళ్లీ పట్టాలెక్కనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చిత్రబృందం భావిస్తోంది. ఈ వినాయక చతుర్థి కానుకగా అంటే సెప్టెంబర్‌ 10న థియేటర్లలో బాలకృష్ణ ‘అఖండ’గా సందడి చేయబోతున్నారన్నమాట. మిర్యాల రవీందర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. శ్రీకాంత్‌, పూర్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని