Navarasas: స్టార్‌ నటులంతా ఒకే వీడియోలో.. మేకింగ్‌ టీజర్‌ - behind the navarasas making of the teaser
close
Published : 25/07/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Navarasas: స్టార్‌ నటులంతా ఒకే వీడియోలో.. మేకింగ్‌ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘నవరస’. సూర్య, విజయ్‌సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, సిద్ధార్థ్‌, అశోక్‌సెల్వన్‌, నాగశౌర్య, రేవతి, అరవింద్‌ స్వామి, గౌతమ్‌ మేనన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. ‘నవరసాలు’ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ తొమ్మిది ఎపిసోడ్‌లుగా అలరించనుంది. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్‌ తెరకెక్కించారు. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం ఇలా ఒక్కో రసాన్ని ఒక్కో ఎపిసోడ్‌గా తీర్చిదిద్దారు. ప్రతి ఎపిసోడ్‌కు వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయి. ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 6 నుంచి అందుబాటులో ఉండనుంది. జయేంద్ర పంచపకేసన్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కాగా.. దీనికి సంబంధించి టీజర్‌ మేకింగ్‌ వీడియోను యూనిట్‌ పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి.

తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్‌ నటులు పనిచేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌తో డైరెక్టర్‌ మణిరత్నంతో పాటు పలువురు స్టార్‌ నటులకు ఇదే తొలి ఓటీటీ కావడం విశేషం. కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు విరాళాల సేకరణలో భాగంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో పనిదొరక్క ఇబ్బందుల్లో కూరుకుపోయిన సినిమా కార్మికులకు చేయూతనివ్వాలనేదే మా ఉద్దేశమని నిర్మాతలు చెప్పారు. ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌ 30-40 నిమిషాల నిడివిలో ఉండనుంది. ఏ.ఆర్‌.రహమాన్‌ సంగీతం అందించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని