సమంతను చూస్తే పడిపోతారు..! - bollywood actor sharib hashmi praises samantha
close
Published : 11/11/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంతను చూస్తే పడిపోతారు..!

బాలీవుడ్‌ నటుడి ప్రశంసలు

ముంబయి: కథానాయిక సమంత గొప్ప వ్యక్తని బాలీవుడ్‌ నటుడు షరీబ్‌ హష్మీ అన్నారు. ‘జాను’ తర్వాత సామ్‌ తొలిసారి వెబ్‌సిరీస్‌ ‘ఫ్యామిలీ మెన్‌ 2’లో నటించిన సంగతి తెలిసిందే. మనోజ్‌ భాజ్‌పాయ్‌, ప్రియమణి జంటగా నటించిన ‘ఫ్యామిలీ మెన్‌’కు కొనసాగింపు ఇది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకులు. అమెజాన్‌ ప్రైమ్‌లో గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన తొలి సీజన్‌ హిట్‌ అందుకుంది. డిసెంబరులో రెండో సీజన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఆఫీసు చుట్టూ సాగిన తొలి భాగంలో మనోజ్‌ నేషనల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ ఏజెంట్‌గా కనిపించారు. కాగా రాబోతున్న సీజన్‌లో సమంత ఉగ్రవాదిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

‘ఫ్యామిలీ మెన్‌ 2’ ప్రచారంలో భాగంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్‌ నటుడు షరీబ్‌ హష్మీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమంతపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘సమంత పాత్ర జబర్దస్త్‌గా ఉంటుంది. ఆమె లుక్‌ చూస్తే పడిపోతారు. ఆమె అద్భుతమైన సహ నటి, గొప్ప వ్యక్తి.  ఈ సిరీస్‌లో సర్‌ప్రైజింగ్‌ రోల్‌ పోషించారు. సమంత గతంలో చేసిన పాత్రలతో పోల్చితే ఇది పూర్తి విభిన్నంగా ఉంటుంది, ఏ మాత్రం సంబంధం ఉండదు’ అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సమంత ట్విటర్‌లో స్పందించారు. ‘వావ్‌.. ధన్యవాదాలు షరీబ్‌ హష్మీ. మీరు కూడా అద్భుతమైన సహ నటుడు’ అని ఆనందం వ్యక్తం చేశారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని