Chiranjeevi: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే బాగుంటుంది - celebrity tweets about ntr birthday anniversary
close
Updated : 28/05/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే బాగుంటుంది

ట్వీట్‌ చేసిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: నట సార్వభౌముడు నందమూరి తారకరామారావుకి భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ ఎంతో గర్వకారణంగా ఉంటుందని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ శుక్రవారం ఉదయం చిరు ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్‌ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. ఆయన 100వ జయంతి దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..’ అని చిరు పేర్కొన్నారు. చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌కి నివాళులర్పిస్తూ ట్వీట్లు పెట్టారు.

‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..’ - తారక్‌

‘ఆయన కారణజన్ముడు. ఆయన తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. రాజకీయాల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాలవారిని ఆదుకున్న మహానుభావుడు. ఆయనే తెలుగు వారి అన్నగారు నందమూరి తారక రామారావు. అన్నగారి జయంతి శుభాకాంక్షలు’ - పరచూరి గోపాలకృష్ణ

‘విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ’ - అనిల్‌ రావిపూడి

‘98వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను’ - నారా రోహిత్‌

‘తెలుగు చలనచిత్ర నట విశ్వరూపం, తెలుగుజాతి ఆత్మగౌరవం, నందమూరి తారకరామారావు 98వ జయంతి శుభాకాంక్షలు’ - గోపీచంద్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని