చిరుపై చరణ్‌ అర్జున్ స్పెషల్‌ సాంగ్‌ - charan arjun sings special song on chiranjeevi
close
Published : 13/06/2021 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరుపై చరణ్‌ అర్జున్ స్పెషల్‌ సాంగ్‌

హైదరాబాద్‌: చిరు ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగంగా బ్లడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌తోపాటు ఇటీవల ఆక్సిజన్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ సంగీత దర్శకుడు, గాయకుడు చరణ్‌ అర్జున్‌ ఓ ప్రత్యేక గీతాన్ని అలపించారు.

‘ఎవరన్నారు నువ్వు చిరంజీవని.. ఇప్పుడు నువ్వే మా సంజీవని’ అంటూ సాగే ఈ పాటను చరణ్‌ అర్జున్‌, నాగదుర్గ ఆలపించారు. ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ఈ పాటను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. నటుడిగా కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ చిరంజీవి.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి ఈ పాట ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మరోవైపు చరణ్‌.. ఇటీవల సోనూసూద్‌పై ఓ స్పెషల్‌ సాంగ్‌ అలపించిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని