close
Published : 20/04/2021 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పుడు సమాచారం వ్యాప్తి.. తమిళ నటుడిపై కేసు

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల తమిళ నటుడు వివేక్‌ అనారోగ్యంతో చైన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే వివేక్‌ మృతికి.. కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ముడిపెడుతూ మన్సూర్‌ అలీ ఖాన్‌ తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌.. మన్సూర్‌ అలీఖాన్‌పై వడపళని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడు చేసిన నిరాధారమైన ఆరోపణలు ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశారు. మరోవైపు అలీఖాన్‌ ముందస్తు బెయిల్‌ కోసం ప్రిన్సిపల్‌ సెషన్‌ కోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాక్సిన్‌కు, వివేక్‌ మరణానికి ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని