తమిళ రీమేక్‌ కోసం చిరంజీవి-సుజీత్‌? - chiranjeevi and sujeeth to remake super hit tamil movie
close
Published : 28/05/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళ రీమేక్‌ కోసం చిరంజీవి-సుజీత్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళంలో విజయమవంతమైన ‘లూసిఫర్' చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్ అయిన ‘యెన్నై అరింధాల్‌’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాకి దర్శకత్వం వహించేందుకు ‘సాహో’ దర్శకుడు సుజీత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారట. స్క్రిప్టు చిరంజీవికి నచ్చితే సినిమా పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు.

తొలుత ‘లూసిఫర్‌’ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్‌ జులైలో తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా పూర్తి కాగానే ‘లూసిఫర్‌’ సెట్స్ పైకి రానుంది. ఆ తర్వాతే చిరంజీవి - సుజీత్‌ల సినిమా ఉండనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమిళంలో యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ‘యెన్నై అరింధాల్’లో అజిత్ కథానాయకుడిగా త్రిష నాయికగా నటించి మెప్పించారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని