రామ్‌చరణ్‌, శంకర్‌ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్‌? - chiranjeevisalman could be a part of shankar - ramcharan movie
close
Updated : 13/04/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌చరణ్‌, శంకర్‌ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ సినిమా చేయనున్నారు. ఇటు దర్శకుడుకి అటు హీరోకి ఇది 15వ సినిమా కావడం విశేషం. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. కొరియాకు చెందిన నటి సుజీ బే కథానాయికగా నటించనుందని సమాచారం. చిత్ర దర్శకుడు శంకర్‌ సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన ఇతర నటులతోనూ చర్చలు జరుపుతున్నారట. సినిమా ఈ ఏడాది జూలైలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వైపు రామ్‌చరణ్‌ - రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టే ముందుగా దర్శకుడు శంకర్‌ ‘ఆర్‌సీ 15’కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని