క్వారంటైన్‌లో చరణ్‌.. న్యూ ఇయర్‌లో సమంత గిఫ్ట్‌ - cinema celebrities interesting social media posts on december 29th
close
Published : 30/12/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్వారంటైన్‌లో చరణ్‌.. న్యూ ఇయర్‌లో సమంత గిఫ్ట్‌

* మెగా హీరో రామ్‌చరణ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి ఉపాసన కరోనా టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది. అయినా పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ క్వారంటైన్‌లో ఉన్నారు.

* వీలైనంత త్వరగా 2020ని control-alt-delete చేసి, కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని ఉందని కథానాయిక పాయల్‌ రాజ్‌పూత్‌ పేర్కొంది.

* రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజ తన డబ్బింగ్‌ మొదలుపెట్టారు.

* సమంత కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కొత్త ఏడాది ఓ బహుమతితో రాబోతున్నట్లు చెప్పారు. 

* మంచు లక్ష్మి ట్రెండీ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని