రకుల్‌ వ్యవసాయం.. నితిన్‌ రికార్డు.. అదా షూట్‌ - cinema celebrities interesting social media posts on tuesday
close
Published : 26/08/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ వ్యవసాయం.. నితిన్‌ రికార్డు.. అదా షూట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గ్రో విత్‌ మి’ అంటూ సమంత విసిరిన ఛాలెంజ్‌ను కథానాయిక రకుల్‌ పూర్తి చేశారు. ఇంట్లో కావాల్సిన ఆహారాన్ని ఎవరికి వారే పండించుకోవడం ఈ ఛాలెంజ్‌ ప్రత్యేకత. తాను ఏయే ఆకు కూరలు, కాయగూరలను పండించిందో అభిమానులతో పంచుకుంది. నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. సెప్టెంబరు 5న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఎప్పుడైనా హాలిడే రోజున ట్రావెల్‌కు వెళ్తే నిద్రలేపండి అంటున్నారు. 3.2 నిమిషాల్లో 500సార్లు స్కిప్పింగ్‌ చేసినట్లు నితిన్‌ చెప్పుకొచ్చారు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  సుమ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అరుదైన చిత్రాలతో కూడిన వీడియోను షేర్‌ చేశారు. ‘నా సోదరి స్మిధ అద్భుతమైన వీడియో చేసింది’ అని చెప్పుకొచ్చారు. తాను షూట్‌ చేస్తే కరోనా వైరస్‌ పారిపోతుందని అందాల కథానాయిక అదా శర్మ అంటోంది. మరి ఆమె ఎలా షూట్‌ చేసిందో వీడియో పంచుకుంది. ఇంకా ఎవరెవరు ఎలాంటి ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారో చూసేయండి.

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని