ఆర్జీవీకి చరణ్‌ పంచ్‌! శ్రుతి సర్‌ప్రైజ్‌! సావిత్రి సందడి..! - cinema stars intersting social media posts
close
Updated : 24/07/2020 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్జీవీకి చరణ్‌ పంచ్‌! శ్రుతి సర్‌ప్రైజ్‌! సావిత్రి సందడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: వంద భావాలను ఒక్క ఫొటోలో చెప్పొచ్చని అంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ అదే చేశాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘పవర్‌స్టార్‌’ సినిమా, ఆ వివాదంపై చరణ్‌ చేసిన పోస్ట్‌ వర్మకు చురకలంటించేలా ఉందని అంటున్నారు అభిమానులు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్ర ఫొటోను పంచుకుంటూ..‘విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే వినండి’ అంటూ పేర్కొన్నారు. దీనికి అఖిల్‌ స్పందిస్తూ, ‘ఏం క్యాప్షన్‌ ఇచ్చావు’ అని కామెంట్‌ చేయగా, ‘హహ్హహ్హ.. మంచి సందేశం అన్నా’ అని వరుణ్‌ పేర్కొన్నారు. మరి ఫొటో షేర్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏంటో అభిమానుల ఊహకే వదిలేశారు చెర్రీ.

ఇక శ్రుతి హాసన్‌ నటిగా కెరీర్‌ ప్రారంభించి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. సావిత్రక్కగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు శివజ్యోతి. తోటి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రోహిణి.. ‘రౌడీ రోహిణి’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించగా, హిమజతో కలిసి సావిత్రి సందడి చేశారు. ఇలా సామాజిక మాధ్యమాల వేదికగా సందడి చేసిన మన సెలబ్రిటీలు ఎవరెవరు ఏం పంచుకున్నారో చూద్దామా!
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని