‘సినిమా బండి’ ఓటీటీలో వచ్చేస్తోందండి! - cinemabandi premieres on netflixindia
close
Published : 13/05/2021 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సినిమా బండి’ ఓటీటీలో వచ్చేస్తోందండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా సిద్ధమైంది. నూతన దర్శకుడు ప్రవీణ్‌ కండ్రెగుల డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సినిమా బండి’. సినిమా ప్రియులను అలరించేందుకు రాబోతోంది. మే 14న ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. డీ2ఆర్‌ ఇండీ  బ్యానర్‌పై రాజ్‌ అండ్‌ డీకే నిర్మిస్తున్నారు. వికాస్ వశిష్ఠ, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర కీలక పాత్రల్లో నటించారు. శిరీశ్‌ సత్యవోలు సంగీతం సమకూర్చారు. తన గ్రామాన్ని బాగు చేసేందుకు తనకు దొరికిన కెమెరాతో సినిమా తీయాలనుకునే ఒక ఆటోడ్రైవర్‌ ప్రయత్నమే ఈ సినిమా కథాంశం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని