దేవతలు ఉలికిపడేలా.. దేవుడు మైమరచేలా - devathalantha song from naandhi
close
Published : 17/02/2021 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవతలు ఉలికిపడేలా.. దేవుడు మైమరచేలా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దేవతలంతా ఉలికిపడేలా దేవుడు కూడా మైమరచేలా ఏమున్నావే పిల్లా’ అంటున్నారు అల్లరి నరేశ్‌. ఈయన కథానాయకుడుగా విజయ్‌ కనక మేడల తెరకెక్కించిన చిత్రం ‘నాంది’. ఈ సినిమాలోని ‘దేవతలంతా’ అనే పాటను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ గీతానికి శ్రీచరణ్‌  పాకాల స్వరాలు సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చక్కని గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. 

 ఎస్‌.వి.2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సతీశ్‌ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా. కథానాయకుడిగా నరేశ్‌కి ఇది 57వ సినిమా. ఇప్పటి వరకు నటించిన వైవిధ్య పాత్ర పోషించారు నరేశ్‌. ఖైదీగా ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని