వాళ్లందరికీ ‘నాంది’ అంకితం - dil raju appreciated naandhi team
close
Published : 24/02/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లందరికీ ‘నాంది’ అంకితం

హైదరాబాద్‌: ‘‘ఒక మంచి సినిమా తీస్తే పురస్కారాలే కాదు... డబ్బు,  గౌరవమూ వస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన ‘నాంది’ చిత్రబృందం కోసం మంగళవారం హైదరాబాద్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అల్లరి నరేష్‌ కథానాయకుడిగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఇంత మంచి సినిమా చేసిన చిత్రబృందాన్ని అభినందించాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశా’’ అన్నారు. అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘‘నాకు విజయం దక్కాలని చాలా మంది కోరుకున్నారు. వాళ్లందరికీ ఈ సినిమాని అంకితం చేస్తున్నా’’నన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌తోపాటు, ఇతర చిత్రబృందం పాల్గొంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని