నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం - gaali sampath pre release
close
Updated : 07/03/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వయసులో నాకు ఇలాంటి కథ రావడం నిజంగా నా అదృష్టమని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. లవ్లీసింగ్‌ కథనాయిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. షైన్‌ స్క్రీన్స్‌, ఇమేజ్‌ స్పార్క్‌, ఇంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం రాత్రి ప్రిరిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నటుడు రామ్‌ పోతీనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ వయసులో నాకు ఇలాంటి కథ రావడం నిజంగా నా అదృష్టం. నన్ను చూసే.. నా కోసం కథ రాసినట్టు అనిపించింది. నటుడిగా నా జన్మాంతరం గుర్తంచుకునే కథ ఇచ్చారు. ఈ కథ వినగానే మొదట నేను భయపడ్డాను. ఈ చిత్రబృందం నా ఫ్యామిలీలాంటిది. వీళ్లంతా నా బిడ్డల్లాంటివాళ్లు. హీరోహీరోయిన్లు చాలా కష్టపడి పనిచేశారు. సినిమాలో అందరి వల్ల నా పని సులభమైంది. చివరగా గాలి సంపత్‌ నా జీవితంలో ఒక ఆణిముత్యం’ అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని