‘నాంది’లో కీలక పాత్రలు వీరే..!
close
Published : 29/06/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నాంది’లో కీలక పాత్రలు వీరే..!

హైదరాబాద్‌: అల్లరి నరేష్‌ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. ఇటీవల సినిమా ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. దీనిలో ఎప్పుడూ చూడని విధంగా జైల్లో నగ్నంగా కూర్చొని, ఆందోళనగా కనిపిస్తున్నారు నరేష్‌. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులను పరిచయం చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్‌ అనే పోలీస్‌ పాత్రలో హరిశ్‌ ఉత్తమన్‌, సంతోష్‌గా నటుడు ప్రవీణ్‌ కనిపించనున్నారు.

ఈ చిత్రం లాక్‌డౌన్‌ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా జూన్‌ 30న సినిమాలోని చిన్న గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కథ: తూమ్‌ వెంకట్‌, సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కూర్పు: చోటా కె.ప్రసాద్‌.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని