Chiranjeevi: సినీ కార్మికులందరికీ వ్యాక్సిన్‌
close
Updated : 08/06/2021 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: సినీ కార్మికులందరికీ వ్యాక్సిన్‌

సినీ కార్మికులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి సీసీసీ (కరోనా క్రైసిస్‌ ఛారిటీ) ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ వేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. 18 ఏళ్లు నిండినవాళ్లంతా ఎలాంటి సంశయం లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌, అపోలో 24 /7 సహకారంతో కరోనా క్రైసిస్‌ ఛారిటీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమం సోమవారం పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘నిజానికి మూడు వారాల కిందటే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అయితే అప్పట్లో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో విరామం వచ్చింది. పరిశ్రమలో ఎంత మంది ఉంటే అందరికీ వ్యాక్సిన్‌ అందించే ప్రయత్నం చేస్తున్నాం.24 విభాగాలకి చెందిన కార్మికులు, నటీనటులతోపాటు సినీ పాత్రికేయుల్ని కూడా ఇందులో చేర్చాం. ఇప్పటికే వేలమంది పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకి ఐదారు వందల మందికి వ్యాక్సిన్‌ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీలో ఉన్న ప్రతి ఒక్క పైసాని కూడా అవసరం ఉన్నవాళ్లకి చేరేలా చర్యలు తీసుకుంటామని, అందుకు తాను భరోసా ఇస్తున్నానని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంకర్‌, అనిల్‌ కుమార్‌ వల్లభనేని, దొరై తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని