The Family Man2: రెమ్యునరేషన్ అంతా?
close
Published : 14/06/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

The Family Man2: రెమ్యునరేషన్ అంతా?

హైదరాబాద్‌: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ను సొంతం చేసుకున్న థ్రిల్లర్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’. బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రతినాయిక లక్షణాలు ఉన్న రాజీ పాత్రలో సమంత.. తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.

కాగా, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ముగ్గురు నటీనటుల రెమ్యునరేషన్‌ గురించి తాజాగా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సిరీస్‌లో ఎంతో కీలకంగా చెప్పుకునే శ్రీకాంత్‌ తివారీ పాత్రలో నటించినందుకుగాను మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్‌. అలాగే సమంత సైతం ప్రతినాయికగా నటించినందుకు రూ.4 కోట్లు, శ్రీకాంత్‌ తివారీ సతీమణి పాత్రను పోషించినందుకు ప్రియమణి రూ.80 లక్షలు తీసుకున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని