ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ ఇదే
close
Published : 25/06/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ ఇదే

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. మరో మూడు నెలల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలై పోయాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష పీఠం కోసం నటుడు ప్రకాష్‌రాజ్‌, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవిత, హేమ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాష్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మంది సభ్యులతో రూపొందించిన ఓ జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం.. మన నటీనటుల బాగోగుల కోసం.. ‘మా’ టీంతో రానున్న విషయాన్ని తెలియపరుస్తున్నా’’ అన్నారు. ‘‘పదవులు కాదు.. పనులు చేయడం కోసం ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నాన’’ని తెలియజేశారు.  

ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ ఇదే..: ప్రకాష్‌రాజ్‌, జయసుధ, శ్రీకాంత్‌, బెనర్జీ, సాయికుమార్‌, తనీష్‌, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్‌, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్‌, సమీర్‌, ఉత్తేజ్‌, బండ్ల గణేష్‌, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్‌, టార్జాన్‌, సురేష్‌ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్‌, గోవిందరావు, శ్రీధర్‌ రావు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు ఈ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని