వధూవరుల ఆటపాట
close
Published : 25/06/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వధూవరుల ఆటపాట

నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితుల వల్ల ఆగిన ఈ సినిమా చిత్రీకరణ.. గురువారం హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా.. నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో నాయకానాయికలపై ఓ సందర్భోచిత గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాట తర్వాత మరికొన్ని కీలక సన్నివేశాలు షూట్‌ చేసి చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. కథ, మాటలు, పాటలు, నటీనటుల అభినయాలు.. అన్నీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తాయి’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని