స్క్రిప్ట్‌ సిద్ధం
close
Published : 25/06/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్క్రిప్ట్‌ సిద్ధం

థానాయకుడు రామ్‌, దర్శకుడు ఎన్‌.లింగుసామి  కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా ఫైనల్‌ స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారు. ఈ విషయాన్ని హీరో రామ్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘లింగుసామి తుది స్క్రిప్ట్‌ వినిపించారు. అద్భుతంగా వచ్చింది. లవ్‌ యు సర్‌. చిత్రీకరణ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఓ పవర్‌ఫుల్‌ మాస్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇందులో రామ్‌కు జోడీగా కృతి శెట్టిని ఖరారు చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని