సంగీత ప్రపంచంలోకి సురేష్‌ ప్రొడక్షన్స్‌
close
Published : 25/06/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంగీత ప్రపంచంలోకి సురేష్‌ ప్రొడక్షన్స్‌

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 57ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చితాల్ని ప్రేక్షకులకు అందించిన ఈ సంస్థ.. ఇకపై సంగీత ప్రియుల్నీ అలరించేందుకు సిద్ధమైంది. ‘సురేష్‌ ప్రొడక్షన్స్‌ మ్యూజిక్‌’ పేరుతో కొత్త మ్యూజిక్‌ లేబుల్‌ను ప్రారంభించి, సంగీత పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించి ‘ఎస్పీ మ్యూజిక్‌’ లోగోని తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్‌ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాని ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ ‘ఎస్పీ మ్యూజిక్‌’ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొస్తున్నాం. ఈ వేదిక మీద వినసొంపైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మంచి సంగీతానికి పవర్‌హౌజ్‌లా ఉంటుంది’’ అన్నారు. 1964లో నిర్మాత రామానాయుడు స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ బాధ్యతల్ని ఇప్పుడాయన తనయుడు డి.సురేష్‌బాబు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థలో ‘నారప్ప’, ‘విరాటపర్వం’, ‘దృశ్యం 2’ లాంటి చిత్రాలు నిర్మితమవుతున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని